ఆసక్తిని రేకెత్తిస్తూ.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది: పవన్

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 11:45 AM

ఆసక్తిని రేకెత్తిస్తూ.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది: పవన్

హైదరాబాద్, నవంబర్ 25: హాస్య నటుడు సునీల్ కథానాయకుడిగా '2 కంట్రీస్‌' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మనీషారాజ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ చిత్ర టిజర్ ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... " టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తూ, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. సినిమా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకొంటున్నా" అన్నారు. సునీల్‌ మాట్లాడుతూ... " పవన్‌ కల్యాణ్‌ మా సినిమా టీజర్‌ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్‌ బాగుందని ప్రశంసించారని" అన్నారు. దర్శక నిర్మాత ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ... " సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మేం అడగ్గానే మాకోసం సమయం కేటాయించి మరోసారి సహృదయతని చాటారు పవన్‌కల్యాణ్."‌ అని చెప్పారు.

Untitled Document
Advertisements