మక్కా మసీదులో ఫొటోలు, వీడియోల నిషేధం

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 12:08 PM

మక్కా మసీదులో ఫొటోలు, వీడియోల నిషేధం

సౌదీ అరేబియా, నవంబరు 25: ఎప్పుడు పర్యాటకులతో రద్దీగా ఉండే ముస్లింల పవిత్ర స్థలం మక్కా మసీదులో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు సౌదీ విదేశీ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మక్కా మసీదుతో పాటు మదీనాలోను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఫొటోలు, వీడియోలు తీయకూడదని స్పష్టం చేసింది. పవిత్ర స్థలాలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.





Untitled Document
Advertisements