నాని అనౌన్స్ మెంట్ విన్నారా..!

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 12:19 PM

నాని అనౌన్స్ మెంట్ విన్నారా..!

హైదరాబాద్, నవంబర్ 25: తెలుగు తెరపై వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని, నిర్మాతా కాబోతున్నడంటా..! నాని ఏంటి నిర్మాతగా అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజమే. తాజాగా నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశారు. అ వీడియోలో... " హాయ్, ఒక చిన్న అనౌన్స్ మెంట్. అందుకే ఈ వీడియో. ఈ ఇయర్ బిగినింగ్ లో ప్రశాంత్ అనే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఓ చిన్న పాత్రకు నన్ను వాయిస్ ఓవర్ అడిగాడు. ఆ కథ చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఇలాంటి కథను స్క్రీన్ మీద చూడలేదనిపించింది. ఇలాంటి సినిమాకు సరైన టీమ్, సపోర్ట్ అవసరమనిపించింది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రశాంత్ అని అడిగా.

ఇంకా తెలియదు భయ్యా... ఎలాగోలా మేనేజ్ చేస్తానని చెప్పాడు. ఇది మేనేజ్ చేసే సినిమా కాదు... సరిగా చేయాలని అని చెప్పా. నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అని నాకు అనిపించింది. వెంటనే, ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత ఎంతో మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఈ కథ విని, నచ్చి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఫిబ్రవరిలో మీ అందరి ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ లుక్ రిలీజ్, టైటిల్ అనౌన్స్ మెంట్ కోసమే ఈ వీడియో. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటాయి". అని చెప్పారు. ప్రస్తుతం నాని 'ఎంసిఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)' చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements