ఎమ్మెస్ ను అలా భయపెట్టాం : వేణుమాధవ్

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 12:59 PM

ఎమ్మెస్ ను అలా భయపెట్టాం : వేణుమాధవ్

హైదరాబాద్, నవంబర్ 25 : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో హాస్యం పండించి, ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్యనటుల్లో వేణుమాధవ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తాజాగా ఆయిన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సరదా సన్నివేశాన్ని అభిమానులుతో పంచుకున్నారు. వేణు మాధవ్ మాట్లాడుతూ " నేను కొత్తగా మారుతి కారు కొన్నాను. షూటింగ్ స్పాట్ లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, నేను ఉన్నాము. ఎమ్మెస్ నారాయణను భయపెడదామనే ఉద్దేశంతో బ్రహ్మానందానికి కన్నుగీటి, ఎమ్మెస్ తో " అన్నా నేను కొత్తగా కారు కొన్నాను .. ముందుగా నువ్ ఎక్కాలి" అన్నాను. దానికి ఎమ్మెస్ బ్రహ్మా౦ అన్న వున్నాడురా .. నేను ఒక్కడినే ఎక్కితే బాగుండదు .. ఆయనని కూడా పిలువు" అన్నాడు. సర్లే అని చెప్పేసి బ్రహ్మానందాన్ని వెనక సీట్లో కూర్చోమన్నాను. ఎమ్మెస్ .. ముందు సీట్లో కూర్చున్నాడు. ఫిల్మ్ సిటీ రోడ్లపై కారు నడపడం మొదలుపెట్టాను.

కారు 100 మీద వెళుతుండగా .. కావాలనే పేవ్ మెంట్ మీదకి ఎక్కించాను. కారు ఏట వాలుగా దూసుకుపోతోంది. "ఆపరా .. ఆపరా .. నేను చచ్చిపోతాను రా" అంటూ ఎమ్మెస్ అరుస్తున్నారు. అబ్బా .. ఆగన్నా" అంటూ నేను కార్లో అటూ ఇటూ ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తున్నాను. "ఏంట్రా వెతుకుతున్నావ్ " అన్నారాయన. ఇక్కడెక్కడో బ్రేక్ ఉండాలన్నా .. నీ దగ్గరేమైనా ఉందేమో చూడు" అన్నాను. అంతే దాంతో ఎమ్మెస్ ఫేస్ చూడాలి... అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

Untitled Document
Advertisements