టీంఇండియా మాజీ క్రికెటర్ భార్యకి కరోనా పాజిటివ్

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:54 PM

టీంఇండియా మాజీ క్రికెటర్ భార్యకి కరోనా పాజిటివ్

భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. పశ్చిమ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా ప్రస్తుతం లక్ష్మీ రతన్ శుక్లా ఉండగా.. అతని భార్య స్మిత సన్యాల్ శుక్లా... హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోంది. తాజాగా స్మిత కరోనా వైరస్ బారిన పడినట్లు స్వయంగా లక్ష్మీ రతన్ వెల్లడించాడు.


భారత్ తరఫున మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లాడిన లక్ష్మీ రతన్ శుక్లా.. 18 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. అలానే 2008 నుంచి 2014 వరకూ మొత్తం 47 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన ఈ ఆల్‌రౌండర్ 405 పరుగులు చేసి.. 15 వికెట్లు పడగొట్టాడు. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి ఆడిన లక్ష్మీ రతన్ శుక్లా.. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూడా ఆడాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఈ ఆల్‌రౌండర్.. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో 137 ఫస్ట్ క్లాస్, 141 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడటం విశేషం. 2015లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన లక్ష్మీ రతన్ శుక్లా.. రాజకీయాల్లో చేరి ప్రస్తుతం స్పోర్ట్స్‌ మినిస్టర్‌గా ఉన్నాడు.

‘‘అవును.. నా భార్య స్మితకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెకి తేలికపాటి జ్వరం వచ్చింది. దాంతో.. వైద్యులు సూచించిన మేరకు మందులు తీసుకుంటోంది. నేను, నా ఇద్దరు కొడుకులు, మా నాన్న ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాం. మాకు రానున్న గురువారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు’’ అని లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించాడు.





Untitled Document
Advertisements