మోదీ పై చెప్పు విసిరితే రూ.లక్ష బ‌హుమ‌తి: రామ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 01:17 PM

మోదీ పై చెప్పు విసిరితే రూ.లక్ష బ‌హుమ‌తి: రామ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

న్యూ డిల్లీ, నవంబర్ 25: నెట్టింట్లో వివాదాస్పద ట్వీట్ లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌ముఖ యాడ్ ఫిల్మ్ మేక‌ర్‌, యాక్టివిస్ట్ రామ్ సుబ్ర‌మ‌ణియ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రధాని న‌రేంద్ర‌మోదీ మీద చెప్పు లేదా బూటు విసిరిన వారికి రూ. ల‌క్ష బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని వాయిస్ ఆఫ్ రామ్ నాయకుడు రామ్ సుబ్ర‌మ‌ణియ‌న్ ట్వీట్ చేశాడు. 'ప‌ద్మావతి' సినిమా వివాదంలో దీపికా ప‌దుకునే త‌ల‌ను తెచ్చిన వారికి రూ. 10 కోట్ల బ‌హుమ‌తి అంటూ బీజేపీ నేత ప్ర‌క‌టించ‌డానికి వ్య‌తిరేకంగా రామ్ ఈ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు.

గ‌తంలో ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌ఫున ప్రచారం చేసిన రామ్ ట్వీట్ వెన‌కాల అర‌వింద్ కేజ్రీవాల్ హ‌స్తం ఉందేమోన‌ని వారు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరుతూ ఏకంగా కేజ్రీవాల్‌ను అడుగుతున్నారు. అలాగే రూ. 1000కే కేజ్రీవాల్ మీద తాము చెప్పు విసురుతామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Untitled Document
Advertisements