LIC స్కీమ్: కేంద్రం హామీ.... ప్రతి నెలా రూ.9,000!

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 12:08 PM

LIC స్కీమ్: కేంద్రం హామీ.... ప్రతి నెలా రూ.9,000!

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్, యాన్యుటీ ప్లాన్ ఇలా ఎన్నో రకాల పాలసీలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో చేరడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. ఎల్‌ఐసీ అలాగే వయ వందన యోజన స్కీమ్‌ను అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తరుపున ఎల్ఐసీ ఈ వయ వందన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో చేరడం వల్ల 60 ఏళ్లు దాటిన వారు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీరు పొందే పెన్షన్ కూడా మారుతుంది. కాగా ఈ పథకం 2023 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అయితే ఈ పథకంలో కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరడానికి వీలుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే పదేళ్ల వరకు పథకం ప్రయోజనాలు పొందొచ్చు. వయ వందనయోజన స్కీమ్ ద్వారా 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పటి దాకా 6.28 లక్షల మంది ఈ పథకంలో చేరారు.

పథకంలో చేరడం వల్ల నెలకు రూ.1,000 నుంచి రూ.9,250 వరకు పెన్షన్ పొందొచ్చు. నెలకు లేదంటే మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు. రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.9,250 పెన్షన్ వస్తుంది. కనీసం రూ.1.5 లక్షలు పెట్టాలి. ఇలా చేస్తే రూ.1,000 పెన్షన్ పొందొచ్చు. అంతేకాకుండా ఈ పథకంలో చేరడం వల్ల లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.






Untitled Document
Advertisements