అటు ఎన్టీయార్ ఇటు రామ్‌చరణ్ మధ్యలో 'ఆర్ఆర్ఆర్'

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 12:38 PM

అటు ఎన్టీయార్ ఇటు రామ్‌చరణ్  మధ్యలో  'ఆర్ఆర్ఆర్'

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే మరో రెండు వారాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల కావాల్సింది. తొలుత ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే అనుకున్నట్టుగా షూటింగ్ జరగకపోవడంతో 2021 జనవరి 8కి వాయిదా వేశారు. కరోనా కారణంగా మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడడం లాంఛనంగానే కనిపిస్తోంది. దీంతో ఎన్టీయార్, రామ్‌చరణ్ కాస్త అసంతృప్తితో ఉన్నారట.

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీయార్, చెర్రీ రెండేసి సంవత్సరాలు కేటాయించారు. మరో సంవత్సరం కూడా కేటాయించక తప్పేలా లేదు. మరోవైపు వీరిద్దరి కోసం వేరే దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయమని రాజమౌళిని కోరుతున్నారట. 2021 వేసవి సమయానికైనా షూటింగ్‌ను పూర్తి చేసి తమను రిలీవ్ చేయమని అడుగుతున్నారట. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే వేరే సినిమాలను ప్రారంభించాలని ఇద్దరూ భావిస్తున్నారట.





Untitled Document
Advertisements