స్టేట్ బ్యాంక్ నుంచి కొత్త వ్యాపారానికి లోన్లు...రూ.9 లక్షల రుణం!!!

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 01:15 PM

స్టేట్ బ్యాంక్ నుంచి కొత్త వ్యాపారానికి లోన్లు...రూ.9 లక్షల రుణం!!!

కరోనా వైరస్ దెబ్బకి చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఉద్యోగాలు పోతున్నాయి. పనులు లేవు. ఆదాయం తగ్గిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది వ్యాపారం చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సులభంగా రుణాలు అందిస్తోంది. దీనికి ఎలాంటి చదువు అవసరం లేదు.

అయితే ఎస్‌బీఐ అందిస్తున్న రుణంతో కేవలం ఒకే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అదే పౌల్టీ బిజినెస్. ఎస్‌బీఐ పౌల్టీ లోన్ అందిస్తోంది. పౌల్ట్రీ వ్యాపారం ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గుడ్లు, చికెన్ ఇలా రెండు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. చికెన్, ఎగ్స్‌కు సంవత్సరం పొడువునా డిమాండ్ ఉంటుంది.

అందువల్ల పౌల్ట్రీ బిజినెస్ చేయాలని యోచించే వారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని పనిని స్టార్ట్ చేయొచ్చు. పౌల్ట్రీ షెడ్, ఫీడ్ రూమ్ ఇతరత్రా వాటికి లోన్ పొందొచ్చు. మీకు అయ్యే ఖర్చులో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ పౌల్ట్రీ లోన్స్‌పై వడ్డీ రేటు 10.6 శాతంగా ఉంది. ఇది ఫ్లోటింగ్ రేటు బేస్డ్ రుణాలు. రీసెట్ డేట్ ఏడాది. లోన్ పొందే వారు ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిల్లో ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కలిగిఉంటే సరిపోతుంది. అలాగే ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ఏకంగా రూ.9 లక్షల వరకు రుణం పొందొచ్చు.





Untitled Document
Advertisements