భారత్ డాక్టర్ కి బెన్‌స్టోక్స్ గౌరవార్థం

     Written by : smtv Desk | Mon, Jul 13, 2020, 02:05 PM

భారత్ డాక్టర్ కి బెన్‌స్టోక్స్ గౌరవార్థం

వెస్టిండీస్‌పై తొలి టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ధరించిన జెర్సీపై భారత వైద్యుడి పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ బాధితులకి చికిత్స అందిస్తున్న వైద్యుల పేర్లని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ క్రికెటర్ల జెర్సీపై వేయించింది. ఆపత్కాలంలో వైద్యుల సాహసోపేత సేవలని గుర్తు చేసుకుంటూ వారి గౌరవార్థం ఆ పేర్లని ఈసీబీ వేయించింది. ఈ క్రమంలో భారత్‌కి చెందిన డాక్టర్ వికాస్ కుమార్ పేరుని బెన్‌స్టోక్స్‌ జెర్సీపైకి చేరింది.

ఇంగ్లాండ్‌లో ఉంటున్న డాక్టర్ వికాస్ కుమార్.. డార్లింగ్‌టన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్‌లో కరోనా వైరస్ రోగులకి సేవలు అందిస్తున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ జెర్సీపై తన పేరు ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చిన డాక్టర్ వికాస్ కుమార్.. ఇది వైద్య రంగంలో ఉన్న వారందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మధ్య మూడేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌కి డాక్టర్‌గా వికాస్ కుమార్ పనిచేయడం గమనార్హం.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య సౌథాంప్టన్ వేదికగా ఆదివారం రాత్రి తొలి టెస్టు ముగియగా.. ఈ మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ తన భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని నిర్ణయించుకుని ఈ టెస్టుకి దూరమవగా.. బెన్‌స్టోక్స్ తన కెరీర్‌లో తొలిసారి కెప్టెన్‌గా ఉండి జట్టుని నడిపించాడు. కానీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 43, 46 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్, 4, 2 వికెట్లతో సరిపెట్టాడు.







Untitled Document
Advertisements