నటి జ్యోతికపై ఐపీసీ సెక్షన్ 294బి కేసు నమోదు...

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 02:07 PM

నటి జ్యోతికపై ఐపీసీ సెక్షన్ 294బి కేసు నమోదు...

చెన్నై, నవంబర్ 25: ఈ మధ్య కాలంలో నటీనటులపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా నటి జ్యోతికపై కేసు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నాచియార్' చిత్ర టిజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టిజర్ లో.. జ్యోతిక చెప్పిన డైలాగ్ పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవ‌ర్‌గా పనిచేసే రాజన్ అనే వ్యక్తి, జ్యోతిక వాడిన పదాలు మహిళల గౌరవాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయని, సమాచార సాంకేతిక చ‌ట్టం సెక్షన్ 67 ప్రకారం అది త‌ప్పు అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే ఐపీసీ సెక్షన్ 294బి ప్రకారం కూడా బూతులను మాట్లాడటం శిక్షార్హమని పిటిషన్‌లో తెలిపాడు.

Untitled Document
Advertisements