అందుకే 'పద్మావతి'కి సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వలేదట...

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 02:32 PM

అందుకే 'పద్మావతి'కి  సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వలేదట...

ముంబాయి, నవంబర్ 25: విడుదలకు సిద్ధమైన 'పద్మావతి' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్‌ జారీ కాని విషయం తెలిసిందే. అసలు సెన్సార్ సర్టిఫికెట్‌ ఎందుకు ఇవ్వలేదు? సినిమాపై గల వివాదాల కారణమా? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సభ్యులను సంప్రదించగా... సెన్సార్ సర్టిఫికేట్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని బోర్డు సీఈవో అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. సినిమాను చరిత్ర ఆధారంగా తీశారా? లేక ఫిక్షన్ ఆధారంగా తీశారా? అన్న కాలమ్ ను పూరించలేదని, ఆ కాలమ్ ను ఖాళీగా వదిలేశారని, సినిమా విడుదల సమయంలో కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం తమకు అవసరమని ఆయన చెప్పారు. అందుకే 'పద్మావతి' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిపారు.

Untitled Document
Advertisements