తెలంగాణలో ఒక్క రోజులో 2 వేలు దాటిన కరోనా కేసులు

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 12:17 PM

తెలంగాణలో ఒక్క రోజులో 2 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 2 వేలకు దిగువన కేసులు నమోదు కాగా.. చాలా రోజుల తర్వాత తొలిసారి శుక్రవారం 2083 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 64,786కు చేరింది. శుక్రవారం 21,011 కరోనా టెస్టులు చేయగా.. మొత్తం 4,58,593 టెస్టులు నిర్వహించారు. మరో 883 టెస్టుల ఫలితం రావాల్సి ఉంది. 24 గంటల్లో 11 మంది కరోనా కారణంగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 530కి చేరింది.



జీహెచ్ఎంసీ పరిధిలో 578 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 228 కేసులు, మేడ్చల్ జిల్లాలో 197 కేసులు, వరంగల్ అర్బన్‌లో 134 కేసులు, కరీంనగర్‌లో 108 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 73, నల్గొండ 48, మహబూబాబాద్ 40, పెద్దపల్లి 42, రాజన్న సిరిసిల్ల 39, భద్రాద్రి కొత్తగూడెం 35, ఖమ్మం 32 చొప్పున కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 33 జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా.. ఆసిఫాబాద్‌ (8), నారాయణ్‌పేట్ (9), వనపర్తి (9) జిల్లాల్లోనే సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం 1114 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 46,502కు చేరింది. రికవరీ రేటు 71.7 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,754గా ఉంది. వీరిలో 11,359 మంది హోం ఐసోలేషన్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు.





Untitled Document
Advertisements