రైతుల అకౌంట్లలోకి డబ్బులు...ప్రతి ఒక్కరికీ రూ.2,000

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:41 PM

రైతుల అకౌంట్లలోకి డబ్బులు...ప్రతి ఒక్కరికీ రూ.2,000

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. పీఎం కిసాన్ స్కీ్మ్‌లో రిజిస్టర్ అయిన వారికి తీపికబురు తీసుకువచ్చింది. పీఎం కిసాన్ స్కీమ్‌‌లో ఉన్న వారికి ఆరో విడత కింద రూ.2,000 అందిస్తోంది. ఈరోజు నుంచే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వెళ్లనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు డబ్బులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో చేరిన అన్నదాతలకు కేంద్రం సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. అంటే ఏడాదికి రైతులు రూ.6,000 ఉచితంగా పొందొచ్చు.
ఇప్పుడు రైతులకు ఆరో విడత డబ్బులు రూ.2,000 అందనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి అంటే ఈరోజు నుంచి రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. ఇకపోతే ఇప్పటికీ కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే సలుభంగానే ఆన్‌లైన్‌ ద్వారా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

ఇకపోతే ప్రస్తుతం రూ.2,000 అందే రైతుల పేర్లు లిస్ట్‌లో ఉన్నాయో లేదో సులభంగా చూడొచ్చు. దీని కోసం pmkisan.gov.in సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బార్‌లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరీ లిస్ట్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రం పేరు, డిస్ట్రిక్, బ్లాక్, విలేజ్ పేర్లు ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి. ఇక మీ సమాచారం వస్తుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉంటుంది.





Untitled Document
Advertisements