73 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు...త్వరలో వెలుగులు!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:57 PM

73 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు...త్వరలో వెలుగులు!

స్వాతంత్రం అనంతరం దశాబ్దాలుగా చీకట్లో మగ్గిపోతున్న ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మూడు గ్రామాల్లో త్వరలో వెలుగులు ప్రసరించనున్నాయి. నిరంతం పాక్ దాడుల సహా భారీ మంచు కారణంగా ఆరు నెలలు పాటు దాదాపు బయట ప్రపంచంతో ఈ గ్రామాలకు సంబంధాలు తెగిపోతాయి. ఈ మూడు గ్రామాల్లో మొత్తం 14వేల మంది నిరుత్సాహకరమైన జీవితాలను గడపుతున్నారు.

ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి కశ్మీర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీడీసీఎల్) రెండేళ్ల గడువు నిర్దేశించుకుంది. కేరన్, ముండియన్, పట్రారు గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు 33 కేవీ లైన్, సబ్-స్టేషన్‌ ఏర్పాటు ప్రక్రియ గతవారం ముగిసింది. నియంత్రణ రేఖకు కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న కేరన్‌కు విద్యుత్తు సరఫరా కోసం ఈ ప్రాజెక్టు కింద 979 స్తంభాలు ఏర్పాటు చేశారు.

విద్ధుదీకరణ పనులు వేగంగా జరగడానికి కోవిడ్-19 లాక్‌డౌన్ సహకరించిందని కేపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమూద్ అజీజ్ అసద్ అన్నారు. లాక్‌డౌన్ వల్ల సాధారణ కార్యకలాపాలు నిలిచిపోవడతో ఈ ప్రాజెక్టు పనులకు వర్కర్లు కొరతలేకుండా వేగంగా పూర్తయ్యిందన్నారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉణ్న సున్నితమైన ప్రాంతం కావడంతో హై టెన్షన్ వైర్లు, స్తంభాలు వేయడానికి తమ బృందానికి సవాల్‌గా నిలిచిందని అసద్ పేర్కొన్నారు.

రక్షణ విభాగానికి చెందిన భూమి కావడంతో సమయం పట్టిందని, ఉన్నతస్థాయి నుంచి ఆమోదాలు అవసరమయ్యాయని ఓ అధికారి తెలిపారు. ‘గ్రామాల్లోని గృహాలు సౌర విద్యుత్తుపై ఆధారపడి ఉన్నాయి లేదా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తున్నాం’ అని అసద్ చెప్పారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ఖర్చు యూనిట్‌కు 2-3 రూపాయల మధ్య ఉంటుంది.

Untitled Document
Advertisements