ఏపీలో కరోనా : ఒకే రోజు 12 వేల మంది డిశ్చార్జి!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 06:07 PM

ఏపీలో కరోనా : ఒకే రోజు 12 వేల మంది డిశ్చార్జి!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, శనివారం మాత్రం స్వల్ప స్థాయిలో తగ్గాయి. అయితే ఇందులో ఆనందించదగ్గ విషయం ఏంటంటే శనివారం భారీ సంఖ్యలో కరోనా నుంచి కోల్కొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఏకంగా 12 వేల మందికి పైగా కోలుకున్నారు. తాజాగా, శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఏకంగా 9,276 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో రికార్డు స్థాయిలో 58 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 60,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 9,276 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,50,209కు చేరింది.

ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 58 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,407కు చేరింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, విశాఖపట్నంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇక గడిచిన 24 గంటల్లో 12,750 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,50,209 పాజిటివ్ కేసులకు గాను 76,614 మంది డిశ్చార్జి కాగా.. 72,188 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Untitled Document
Advertisements