సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఫైనాన్స్ స్కీమ్స్...రూ.2,999తో స్కూటర్ ఇంటికి పట్టుకెళ్లండి!

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 06:07 PM

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఫైనాన్స్ స్కీమ్స్...రూ.2,999తో స్కూటర్ ఇంటికి పట్టుకెళ్లండి!

ఇటీవల కాలంలో బైక్స్ కన్నా టూవీలర్లు కొనేవారు ఎక్కువ అవుతున్నారు. బైక్ అయితే కేవలం మగవారు మాత్రమే నడపగలరు. అదే స్కూటర్ అయితే ఎవరైనా నడపొచ్చు. అందుకే చాలా మంది స్కూటర్లు కొనడం ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్కూటర్ నడపాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.

కంపెనీలు కొత్త కొత్త ఫైనాన్స్ స్కీమ్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా హీరో ఎలక్ట్రిక్ కూడా కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత పైనాన్స్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీని కోసం హీరో ఎలక్ట్రిక్.. ఆటో‌వెర్ట్ టెక్నాలజీస్ కంపెనీతో జతకట్టింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ నడపాలని భావించే వారు ఈ ఫైనాన్స్ స్కీమ్ ప్రయోజనాలు పొందొచ్చు. ఆల్ ఇన్‌క్లూజివ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. వీటి ధర నెలకు రూ.2,999 నుంచి ప్రారంభమౌతున్నాయి. ఈ ప్లాన్స్ ఎంచుకోవడం వల్ల స్కూటర్‌తో పాటు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, సర్వీస్, మెయింటెనెన్స్, లాయల్టీ బోనస్‌లు, ఆకర్షణీయ అప్‌గ్రేడ్ ఆప్షన్స్ వంటి ఫెసిలిటీలు పొందొచ్చు.

ప్రత్యామ్నాయ ఓనర్‌షిప్ ఆప్షన్స్ కోరుకునే వారు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నారని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. వీరి కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపింది. ప్లాన్స్ ధర నెలకు రూ.2,999 నుంచి స్టార్ట్ అవుతోందని పేర్కొంది. స్కూటర్ మెయింటెనెన్స్, సర్వీస్ వంటివి తామే చూసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఈ స్కీమ్స్ బెంగళూరులో ఎంపిక చేసిన డీలర్‌షిప్స్ వద్దనే అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావొచ్చు.

Untitled Document
Advertisements