ఈ రోజు నుంచే కొత్త రూల్స్...పలు అంశాల్లో మార్పు

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 07:05 PM

ఈ రోజు నుంచే కొత్త రూల్స్...పలు అంశాల్లో మార్పు

కొత్త నెల వచ్చేసింది. కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఆగస్ట్ 1 నుంచి చాలా అంశాలు మారబోతు న్నాయి. దీంతో ప్రజలపై నేరుగానే ప్రభావం పడనుంది. బ్యాంక్ లోన్ దగ్గరి నుంచి పీఎం కిసాన్, మినిమమ్ బ్యాలెన్స్ వరకు చాలా అంశాలు మారబోతున్నాయి. అందువల్ల ఈ రోజు నుంచి ఏ ఏ అంశాలు మారుతున్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.

1. బ్యాంక్ కస్టమర్లకు ఝలక్. చాలా బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ను మళ్లీ అమలులోకి తీసుకువస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి వాటిల్లో అకౌంట్ కలిగిన వారికి ప్రతికూల ప్రభావం పడనుంది. కొన్ని బ్యాంకులు క్యాష్ డిపాజిట్‌పై పరిమితుల విధిస్తే.. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు వసూలు చేయనున్నాయి.

2. వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేసే వారు తీపికబురు. ఇకపై కొత్తగా వెహికల్ కొనుగోలు చేసే వారు దీర్ఘకాల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవలసిన అవసరం లేదు. దీంతో వీరికి ఊరట కలుగనుంది.

3. ఆగస్ట్ 1 నుంచి ఈకామర్స్ సంస్థలు కచ్చితంగా అవి విక్రయించే వస్తువులు ఎక్కడ తయారయ్యాయో తెలియజేయాలి. లేదంటే జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే జైలు శిక్ష పడే అవకాశముంది.


4. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. సిలిండర్ ధర పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతుంది.

5. ఒకటో తేదీ నుంచి రైతులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ పీఎం కిసాన్ డబ్బులను ఈరోజు నుంచే బ్యాంక్ అకౌంట్లలో జమచేయనుంది.

6. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి బ్యాడ్ న్యూస్. ఈ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఇకపై వడ్డీ రేట్లు 4.75 శాతం నుంచి ప్రారంభమౌతాయి.





Untitled Document
Advertisements