హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్ల లిస్ట్

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 07:13 PM

హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్ల లిస్ట్

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ తీవ్రత కొద్దిగా తగ్గినప్పటికీ.. భాగ్యనగరంలో రోజూ 500కు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. జులై 25న 641 కేసులు నమోదు కాగా.. 26న 506 కేసులు, 27వ తేదీన 531, 28న 509 కేసులు, 29న 521 కేసులు, 30న 586, జులై 31న 578 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కంటైన్మెంట్ జోన్లు చార్మినార్ పరిధిలో 31 ఉండగా.. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ జోన్ (26) నిలిచింది. ఖైరతాబాద్ జోన్‌లో 14, ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కూకట్‌పల్లి జోన్‌లో ఏడు, శేరిలింగపల్లి జోన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. భాగ్యనగరం పరిధిలో మొత్తం 93 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
ఉప్పల్ సర్కిల్ పరిధిలో రామాంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్, పీఎస్ కాలనీ, హయత్ నగర్ సర్కిల్ పరిధిలో బండ్లగూడ ఇంద్రప్రస్థ కాలనీ రోడ్ నంబర్ 5, సరూర్ నగర్ పరిధిలోని మైత్రి నగర్, సాహితీ నగర్‌లు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అతి తక్కువ కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతం ఎల్బీ నగర్ కావడం గమనార్హం. లాక్‌డౌన్ సమయంలో ఎల్బీ నగర్ జోన్లోని హయత్ నగర్ సర్కిల్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న జోన్ చార్మినార్. ఇక్కడ 31 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. గతంలో మలక్‌పేట ప్రాంతం కోవిడ్ హాట్ స్పాట్‌గా ఉండేది. ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్, ఆజంపుర చంచలగూడ, విజయా డయాగ్నోస్టిక్ సమీపంలోని మూసారాంబాగ్ ఇంటర్నల్ రోడ్, బాఘ్ ఈ జహ్రా చవానీ, అక్బర్‌బాఘ్ ప్రొఫెసర్ కాలనీ, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీలు కంటైన్మెంట్ జోన్లు. ఇవన్నీ మలక్‌పేట సర్కిల్ పరిధిలోకి వస్తాయి. సంతోష్ నగర్‌ పరిధిలోని దానయ్య నగర్, ఎస్ఆర్టీ కాలనీ, పటేల్ నగర్, హనుమాన్ నగర్, కూర్మగూడ గ్యాస్ ఏజెన్సీ వెనుక ప్రాంతం;
చంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలోని శివాజీ నగర్, అరుంధతీ కాలనీ, లలితా బాఘ్, రక్షాపురం, రియాసత్ నగర్, బండ్లగూడ రాజీవ్ గాంధీ నగర్, శివాజీ నగర్, బండ్లగూడ పటేల్ నగర్, కుమార్‌వాడీ కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. చార్మినార్ సర్కిల్‌లోని ఘన్సీబజార్, మొఘల్‌పుర; ఫలక్‌నుమా సర్కిల్‌లోని మోచీ కాలనీ, అసద్ బాబా నగర్, దూద్ బౌలి, బీబీ కా చస్మా, కొండారెడ్డిగూడ; రాజేంద్రనగర్ సర్కిల్‌లోని హైదర్‌గూడ ఆంబియన్స్ ఫోర్ట్, 4-2-16/2 అత్తాపూర్, హైదర్‌గూడలోని 3-1-22, ఉప్పపల్లి ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.
మెహదీపట్నం సర్కిల్‌లోని దత్తాత్రేయ కాలనీ, బజార్ ఘాట్, దోబీ ఘాట్, ఎంజీ నగర్, ఆసిఫ్ నగర్, చింతల్ బస్తీ; కార్వాన్‌లో సర్కిల్‌లోని జియాగూడ నవోదయా కాలనీ, ఎస్బీఏ గార్డెన్ సమీపంలోని రాంసింగ్ పుర; ఖైరతాబాద్ సర్కిల్‌లోని సనత్‌నగర్ జెక్ కాలనీ అల్లాదీన్ కంట్రీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, బాపూనగర్, సనత్‌నగర్ రోలిన్ రెసిడెన్స్, సనత్ నగర్ జెక్ కాలనీ, ఎన్బీటీ నగర్ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జోన్లలో ఖైరతాబాద్ ఒకటి కావడం గమనార్హం.
హైదరాబాద్‌లో చార్మినార్ జోన్ తర్వాత ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతం సికింద్రాబాద్. ముషీరాబాద్ సర్కిల్ పరిధిలో భీమ మైదాన్, ఉందాబాఘ్, ధోబా గలీ, ముగ్గుల బస్తీ, థలబస్తీ, రీసాలా, కవాడీగూడ సాయిబాబా గుడి, దయారా మార్కెట్, రాంనగర్ రామాలయం, హరి నగర్, చేపల మార్కెట్; అంబర్‌పేట్ సర్కిల్ పరిధిలో.. పటేల్ నగర్, శంషీర్ బాఘ్, న్యూ పటేల్ నగర్, హైదర్‌గూడ, బర్కత్‌పుర సురభి అపార్ట్‌మెంట్స్, విట్టలవాడి, ఇందిరా నగర్, తులసి నగర్, సీఈ కాలనీ, కాచిగూడ జేపీ రెసిడెన్సీ, హైదర్‌గూడ-2, బాపు నగర్, ఖాద్రీబాఘ్ శ్రీనివాస ఎన్‌క్లేవ్, చిలకలగూడ గాంధీ విగ్రహానికి ఎదురు వీధి, మోండా మార్కెట్ తకరా బస్తీ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.
యూసఫ్‌గూడ సర్కిల్‌లోని.. న్యూ ప్రేమ్ నగర్ 101 - ఎర్రగడ్డ డివిజన్, వెంకటగిరి 96 - వెంగళరావు నగర్ డివిజన్, వెంకటగిరి 96 - యూసఫ్‌గూడ డివిజన్, వెంగళరావు నగర్ - డి బ్లాక్ 99 - వెంగళరావు నగర్ డివిజన్, ఓల్డ్ సుల్తాన్ నగర్ 101 - ఎర్రగడ్డ డివిజన్, శ్రీ క్రిష్ణా నగర్ ఏ బ్లాక్ 96 - యూసఫ్‌గూడ డివిజన్, హబీబ్ ఫాతిమా నగర్ 102 - రహమత్ నగర్ డివిజన్, వీడియో గల్లీ రహమత్ నగర్ 102 కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.
కూకట్ పల్లి సర్కిల్‌లోని దత్తాత్రేయ కాలనీ, పాపిరెడ్డి నగర్; కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని వినాయక నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ; గాజుల రామారం సర్కిల్‌లోని షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీ, భగత్ సింగ్ నగర్ రోడ్ నం 1, అల్వాల్ సర్కిల్‌లోని అయ్యప్ప నగర్ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. కూకట్‌పల్లి జోన్ పరిధిలో మొత్తం ఏడు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.





Untitled Document
Advertisements