శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి: మరో 5 మహా సంఘటనలు!!!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:51 AM

శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి: మరో 5 మహా సంఘటనలు!!!

హిందు ధర్మంలో శ్రీ కృష్ణుడికి విశేషమైన స్థానముంది. భావి తరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనపడనీయకుండా ఉంటాడు. ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. అంతటి మురళీ మోహనుడు జన్మించిన రాత్రి 5 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మరి వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన 5 ప్రత్యేక ఘటనలేంటో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
​వాసుదేవుడు వర్షంలోనే కృష్ణుడిని తీసుకెళ్లాడు..

శ్రీ కృష్ణుడు జన్మించినపుడు జైలులో ఉన్నవారందరూ యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోనే కృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకెళ్లాడు. ఆ వర్షంలోనే మధుర నుంచి రేపల్లేలో నివసిస్తున్న నందుడి దగ్గరక చిన్నికృష్ణుడిని తీసుకెళ్లాడు. అయితే వాసుదేవుడు ఆ తీవ్ర ఘటననను మనసులో పెట్టుకోలేదు.

​యమునా నది రెండుగా విడిపోయింది..

శ్రీ కృష్ణుడి సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది. వాసుదేవుడు బట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నదీ తీరానికి చేరగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలను తాకి రెండు భాగాలుగా విడిపోయింది. ఆ రెండు భాగాల మధ్య మార్గంలో వాసుదేవుడు ప్రయాణించి గోకులాని చేరుకున్నాడు. నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు.

​వాసుదేవుడు పిల్లలను మార్చాడు..


యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య యశోధ ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్ని పాపను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందుడికి మినహా మిగిలిన వారెవరికి తెలియకపోవడం గమనార్హం. ఆ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడికి ప్రసిద్ధి గాంచాడు.

​వాసుదేవుడికి నందుడు స్వాగతం..

పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు కృష్ణుడిని తీసుకువస్తున్నాడని, తన పాప స్థానంలో చిన్ని కృష్ణుడిని ఉంచాలని వాసుదేవుడి కోసం తలుపు దగ్గరే నిలబడి వేచిచూస్తున్నాడు. వాసుదేవుడు వచ్చిన తరువాత తన చేతిలో ఉన్న కృష్ణుడిని నందుడికిచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఈ సంఘటనను వాసుదేవుడు, నందుడు ఇద్దరూ మర్చిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతో జరిగింది.

​వింధ్యాచల దేవిగా అవతరణ..


నందుడి ఇంట్లో శ్రీ కృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురా నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు. అనంతరం దేవకి తన ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు. అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది. ఆమెనే విధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తారు.





Untitled Document
Advertisements