ముంబయి ట్రాఫిక్ పోలీసులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 12:57 PM

ముంబయి ట్రాఫిక్ పోలీసులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు!

లింగ సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ముంబయి నగర ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్‌పై మహిళల గుర్తులను ఏర్పాటు చేస్తూ, ముంబై పోలీసులు తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పొడగ్తలను అందుకుంటోంది. నగరవ్యాప్తంగా 120 సిగ్నల్స్ వద్ద అధికారులు మహిళల సింబల్స్‌ను ఏర్పాటు చేశారు. దాదర్, జీ నార్త్ వార్డ్ తదితర ప్రాంతాల్లో పురుషుల సిగ్నల్ బదులుగా మహిళలను సూచించే లైట్లు ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) కల్చరల్ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పులు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న పలు దేశాలు.. తమ దేశాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి. ‘నేను దాదర్ ప్రాంతంలో వెళుతుంటే, లింగ సమానత్వాన్ని తెలిపే సింబల్ చూశాను. ఎంతో గర్వంగా అనిపించింది’ అని మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు.

ప్రభాదేవిలోని సిద్దివినాయక ఆలయం నుంచి మహీమ్ పోలీస్ స్టేషన్ వరకు 120 సిగ్నల్స్ వద్ద ఈ గుర్తులను ఏర్పాటుచేశారని తెలిపారు. ‘ఓ శుభవార్త. ముంబైలో ట్రాఫిక్ లైట్లను మార్చారు. లింగ సమానత్వం దిశగా ఇండియా మరో అడుగు వేసింది’ అని యునైటెడ్ నేషన్స్ ఉమెన్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించింది.

ముంబయి సంస్కృతికి వెన్నెముకగా నిలిచే ఈ రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మహిళల గుర్తులను ఏర్పాటుచేశామని నార్త్ వార్డ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరన్ దిఘ్వాకర్ అన్నారు. సిగ్నల్ సంకేతాలను సవరించాలనే ఆలోచన నిపుణులు సూచించిన వాటిలో ఒకటి.. ఈ మార్పులతో ముంబై కొన్ని నగరాల సరసన చేరనుందని, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను సరిదిద్దుతుందన్నారు. ‘లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి సహాయపడే విధంగా చొరవ తీసుకుని పనులు ప్రారంభించి, దాదర్‌లో కొత్త సిగ్నల్స్ ఏర్పాటుచేశామని దిఘ్వాకర్ చెప్పారు.





Untitled Document
Advertisements