మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ సేల్ నేడే

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:56 PM

మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ సేల్ నేడే

మోటొరోలా వన్ ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఈరోజు(ఆగస్టు 8వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించడం విశేషం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధరను రూ.16,999గా నిర్ణయించారు. అయితే తర్వాత దీన్ని రూ.500 పెంచారు. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.17,499కు పెరిగింది. ట్విలైట్ బ్లూ, మూన్ లైట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ ను లాంచ్ అయింది.

మోటొరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను కంపెనీ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. హైబ్రిడ్ మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఈ స్టోరేజ్ ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై వన్ ఫ్యూజన్ ప్లస్ పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనక భాగంలో అందించారు.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయనుండటం విశేషం. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ + గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 210 గ్రాములు.





Untitled Document
Advertisements