ప్రపంచ రికార్డ్: ట్విట్టర్ ట్రెండ్‌లో సత్తా చూపిన మహేష్ బాబు ఫ్యాన్స్

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:58 PM

ప్రపంచ రికార్డ్: ట్విట్టర్ ట్రెండ్‌లో సత్తా చూపిన మహేష్ బాబు ఫ్యాన్స్

సినిమా హీరోలపై అభిమానులకు ఉండే పిచ్చి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏ అభిమాని అయినా తమ హీరోనే గొప్ప అని ఫీలవుతూ ఉంటాడు. తన అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతాడు. ఇలాంటి అభిమానుల సాయంతో మన హీరోలు తమ స్టామినాను చాటుతున్నారు. నిన్నమొన్నటి వరకు వెండితెరపై తమ స్టామినాను చాటిన హీరోలు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సత్తా చూపిస్తున్నారు. దీని వెనుక ఉన్నది కూడా అభిమానులే.

తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు ట్విట్టర్ ట్రెండ్‌లో రికార్డు నెలకొల్పానే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. పుట్టినరోజుకు నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. బర్త్‌డే కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ) మొదలుకొని అడ్వాన్స్ ట్రెండ్, బర్త్‌డే ట్రెండ్, ఆ ట్రెండ్ ఈ ట్రెండ్ అని వరుసపెట్టి ట్వీట్ల వర్షం కురిపిస్తారు. పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్‌డే ట్రెండ్, జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకు ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. అయితే, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరికీ సాధ్యంకాని వరల్డ్ రికార్డును నెలకొల్పారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక హ్యాష్‌ట్యాగ్‌తో 6 కోట్లకు పైగా ట్వీట్లు చేసి అరాచకం సృష్టించారు.


నిజానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ రికార్డును నెలకొల్పుతారని ముందుగానే ఊహించారు విశ్లేషకులు. ఎందుకంటే, మహేష్ బాబు బర్త్‌డే సీడీపీతోనే 3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను సూపర్‌ స్టార్ అభిమానులు సృష్టించారు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు. #HBDMaheshBabu ట్యాగ్‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఏకంగా 24 గంటల్లో 60.2 మిలియన్లకు పైగా ట్వీట్లు చేశారు.ట్విట్టర్ చరిత్రలోనే ఒక హ్యాష్‌ట్యాగ్‌తో 24 గంటల్లో ఇన్ని ట్వీట్లు చేయలేదట. కాబట్టి, ఈ ఫీట్‌ను పట్టుదలతో సాధించిన మహేష్ ఫ్యాన్స్‌ను కచ్చితంగా మెచ్చుకోవాలి. అయితే, ఈ రికార్డును బద్దలుకొట్టాలని మెగా ఫ్యాన్స్ కచ్చితంగా ప్రయత్నిస్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈనెల 22న మెగస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. కాబట్టి, చిరంజీవి పుట్టినరోజు నాడు ట్రెండ్ కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టే ఉంటారు. చూద్దాం ఈ ట్విట్టర్ ట్రెండ్ రికార్డు ఎంత దూరం వెళ్తుందో.



Untitled Document
Advertisements