గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త పాజిటివ్ కేసులు

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 03:56 PM

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా నేడు ఆ సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో పది మంది చనిపోయారు.


అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751 చేరగా, కరోనా నుంచి కోలుకుని 57,586 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 637కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 11,609 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,24,840 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.





Untitled Document
Advertisements