ఐపీఎల్ 2020 సీజన్‌‌‌కి కేంద్ర ప్రభుత్వంపు అధికారిక అనుమతి

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 10:22 PM

ఐపీఎల్ 2020 సీజన్‌‌‌కి కేంద్ర ప్రభుత్వంపు అధికారిక అనుమతి

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌‌‌కి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ సోమవారం వెల్లడించాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. ఈ మేరకు మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కసరత్తలు చేస్తోంది. కానీ.. యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించేందుకు హోమ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి కోరుతూ ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లేఖలు పంపగా.. వాటికి తాజాగా సమాధానం వచ్చింది. విదేశాల్లో టోర్నీలు నిర్వహించే సమయంలో హోమ్, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి తప్పనిసరి.


ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి చైనాకి చెందిన మొబైల్ కంపెనీ వివోని ఇటీవల తప్పించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కొత్త స్ఫాన్సర్‌ కోసం బిడ్స్‌ని కూడా ఆహ్వానించింది. ఈ మేరకు ఇప్పటికే రేసులో అమెజాన్, పతాంజలి, జియో, బైజ్యూస్ తదితర కంపెనీలు ఉండగా.. ఈ గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. మొత్తంగా.. ఈ నెల 18న కొత్త స్ఫాన్సర్ ఎవరనేది..? తేలిపోతుందని బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశాడు.

యూఏఈ వేదికగా 53 రోజుల విండోలో మొత్తం 60 ఐపీఎల్ మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుండగా.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉంది. దాంతో.. వివో తరహాలో టైటిల్ స్ఫాన్సర్‌‌కి ఈ సీజన్‌కి రూ. 440 కోట్లు కాకపోయినా.. కనీసం రూ. 180-200 కోట్లు బీసీసీఐకి వచ్చే అవకాశం ఉంది. యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.





Untitled Document
Advertisements