కొబ్బరి నూనెతో సెక్స్ లైఫ్ ప్రయోజనాలు !!!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 10:31 PM

కొబ్బరి నూనెతో సెక్స్ లైఫ్ ప్రయోజనాలు !!!

కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. కొబ్బరిని నీళ్లలా తాగినా.. కొబ్బరి నూనెను తలకు రాసుకున్నా.. లేదా వంటల్లో వేసుకున్నా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక కొబ్బరి కోరుతో పచ్చడి చేస్తే.. ఆ టేస్టే వేరు కదూ. అయితే, సెక్స్ లైఫ్‌ను మరింత అందంగా.. టేస్టీగా మార్చేది మాత్రం కొబ్బరి నూనే! అదెలా అనుకుంటున్నారా? అయితే, తప్పకుండా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవల్సిందే.

❤ కొబ్బరి నూనెలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, హృదయ కండరాల పనితీరు మెరుగుపడుతుంది. అందుకే గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నూనె ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే, దీన్ని డైట్‌లో తీసుకొనే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

❤ అపరిమిత అసంతృప్త కొవ్వుల వల్ల గుండెకు ముప్పు వాటిల్లుతుంది. అయితే కొబ్బరి నూనెతో మీకు ఆ సమస్య ఉండదు

❤ సహజంగా లభించే సంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. ఇవి ఎక్కువ శాతం కొబ్బరి నూనెలోనే ఉంటాయి. అందుకే దీన్ని మీడియం ట్రైగ్లిజరాయిడ్స్‌ అని కూడా అంటారు.

❤ కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ అధిక వేడి, పిత్తాశయ సమస్యలకు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌గా పనిచేస్తుంది. అంతేగాక తక్షణ శక్తిని సైతం అందిస్తుంది.

❤ ఇతర ఆహారాల్లో ఉండే కొవ్వుల తరహాలో కొవ్వు కణాలను నిల్వ ఉంచదు. కాలేయంలోకి చేరి శక్తిని ఉత్పత్తి చేసేందుకు కూడా సహకరిస్తుంది.

❤ కొబ్బరి నూనెలోని మీడియం ట్రైగ్లిజరాయిడ్స్ కారణంగా కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి పిత్తరసం అవసరం ఉండదు.

❤ తల్లి పాల తరహాలోనే కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ శిలీంధ్ర, బ్యాక్టీయా, వైరస్ వినాశకారిగా పనిచేస్తుంది.

❤ ఫ్రీ రాడికల్ దాడి నుంచి తట్టుకోడానికి, తక్కువ కార్బోహైడ్రేట్స్ కోసం చాలా మంది అథ్లెట్స్ వ్యాయామం తర్వాత ఆహారంలో కాస్త కొబ్బరి నూనె వేసుకుని తింటారు.

❤ కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ఆహారంగానే కాక, సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.

❤ కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని అరికడుతుంది. నూనె రాసుకోవడం ఇష్టం ఉండదని చెప్పకుండా.. తప్పకుండా అలవాటు చేసుకోండి.

❤ కొబ్బరి నూనెలోని కీటోన్లు మెదడుకు స్థిరమైన శక్తిని సరఫరా అందిస్తాయి. కాబట్టి ఎపిలెప్సీ, అల్జీమర్స్ లాంటి వ్యాధులు, మెదడు సంబంధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.

❤ కొబ్బరి నూనె పురుషుల్లో టెస్టోస్టెరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లును ఉత్పత్తి చేస్తుంది.

❤ కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్లు ఉత్పత్తి మెరుగుతుంది. ఫలితంగా సెక్సులో మరింత మజాను పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం కొబ్బరి నూనెను మీ డైట్‌లో భాగం చేసుకుని మాంచి సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.

❤ 2014లో ఓ అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన మాయిశ్చరైజర్ అని, అంగ ప్రవేశానికి కందెనగా కూడా వాడవచ్చని తేలింది. దీనివల్ల మరింత ఎక్కువ సేపు సెక్స్ చేయడం సాధ్యమవుతుందని వెల్లడైంది.

❤ మార్మంగాలు పొడిబారే సమస్యను ఎదుర్కొనేవారు కొబ్బరి నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు.





Untitled Document
Advertisements