బెంగళూరు హింస ఘటనపై ఒవైసీ స్పందన

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:34 PM

బెంగళూరు హింస ఘటనపై ఒవైసీ స్పందన

బెంగళూరులో జరిగిన హింసాత్మక ఘటనను ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘బెంగళూరులో హింసకు దారితీసిన సోషల్ మీడియా పోస్టులు తీవ్ర అభ్యంతరకరమైనవే కాక, ఆమోదయోగ్యం కానివి. వీటిని తీవ్రంగా ఖండించాలి. ఈ విషయంలో హింసకు పాల్పడొద్దని ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పటికీ శాంతి బలపడుతుందని నేను నమ్ముతున్నాను’’ అని అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్.. సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం రాత్రి బెంగళూరు నగరంలో హింస చెలరేగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. హింసకు సంబంధించి పోలీసులపై కాల్పులు జరపడం, రాళ్లు రువ్వడం వంటివి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 110 మందిని అరెస్టు చేశారు. వీరిలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన నిందితుడు నవీన్‌ కూడా ఉన్నారు.






Untitled Document
Advertisements