సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రైతు వేదిక నిర్మాణం...రాష్ట్రంలోని తొలి రైతు వేదిక

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:38 PM

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రైతు వేదిక నిర్మాణం...రాష్ట్రంలోని తొలి రైతు వేదిక

రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా... రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు. సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌ గానూ ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిధులను కూడా కేటాయించింది.

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యంది. రాష్ట్రంలోని తొలి రైతు వేదికగా ఇది గుర్తింపు పొందింది. ఆగస్టు 8న ఈ రైతు వేదిక ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. తంగళ్లపల్లి రైతు వేదిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యవసాయ ప్రాధాన్యాన్ని చాటేలా, రైతుల కోసం ప్రభుత్వ చేపడుతున్న పథకాల పట్ల అవగాహన కల్పించేలా చక్కటి డిజైన్లతో దీన్ని నిర్మించారు.

ఈ వేదిక గోడలపై ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్ ఫొటోలను గీయించారు. లోపలి భాగంలోనూ ఈ ఇద్దరు నేతల ఫోటోలే కనిపించాయి. కానీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫొటోను మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో కొందరు వ్యవసాయ మంత్రి ఫొటో ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు తావు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.





Untitled Document
Advertisements