ఆగస్టు 18న లాంచ్ కానున్న రెండు రియల్ మీ బడ్జెట్ ఫోన్లు

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 07:59 PM

ఆగస్టు 18న లాంచ్ కానున్న రెండు రియల్ మీ బడ్జెట్ ఫోన్లు

రియల్ మీ తన రెండు బడ్జెట్ ఫోన్లయిన రియల్ మీ సీ12, రియల్ మీ సీ15 స్మార్ట్ ఫోన్లు ఆగస్టు 18వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్ మీ తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది. ఈ రెండు డివైస్ ల్లోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. రియల్ మీ సీ12 గీక్ బెంచ్, బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్ సైట్లలో ఇప్పటికే కనిపించింది. రియల్ మీ సీ15 ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12.30కు జరిగే వర్చువల్ ఈవెంట్లో వీటి లాంచ్ జరగనుంది.

రియల్ మీ సీ12, సీ15 ధరలు(అంచనా)
రియల్ మీ సీ15 ఇండోనేషియాలో గత నెలలోనే లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 19,99,000 ఇండోనేషియా రూపాయలుగా(సుమారు రూ.10,300) ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 21,99,000 ఇండోనేషియా రూపాయలుగానూ(సుమారు రూ.11,300), హైఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 24,99,000 ఇండోనేషియా రూపాయలుగానూ(సుమారు రూ.12,800) నిర్ణయించారు. మెరైన్ బ్లూ, సీగల్ సిల్వర్ రంగుల్లో ఇది లాంచ్ అయింది.

గత నెలలో మనదేశంలో లాంచ్ అయిన రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. రియల్ మీ సీ12 ధర దానికంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రియల్ మీ సీ12 స్పెసిఫికేషన్లు (అంచనా)
రియల్ మీ వెబ్ సైట్లో కనిపించిన టీజర్ల మేరకు రియల్ మీ సీ12 స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఫోన్ వెనకభాగంలోనే అందించారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 57 గంటల స్టాండ్ బై టైమ్ లేదా 46 గంటల వాయిస్ కాలింగ్ లేదా 60 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభించనుంది.

గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం ఇందులో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

రియల్ మీ సీ15 స్పెసిఫికేషన్లు(అంచనా)
రియల్ మీ సీ15 టీజర్ ప్రకారం ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లు ఇండోనేషియా వెర్షన్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ఇండోనేషియా వెర్షన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఇందులో అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, మరో 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.





Untitled Document
Advertisements