ఎంఐయూఐ 12 అప్ డేట్ అందుకునే ఏడు ఫోన్లు

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 02:15 PM

ఎంఐయూఐ 12 అప్ డేట్ అందుకునే ఏడు ఫోన్లు

ఎంఐయూఐ 12 అప్ డేట్ మనదేశంలో కూడా అధికారికంగా వచ్చేసింది. ఈ కొత్త అప్ డేట్ ను తమ ఫోన్లకు అధికారికంగా అందిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త అప్ డేట్ ద్వారా షియోమీ ఎన్నో కొత్త ఫీచర్లను తన ఫోన్లకు అందించనుంది. కొత్త యూజర్ ఇంటర్ ఫేస్, వాల్ పేపర్లు, యాప్ డ్రాయర్ కూడా ఇందులో రానున్నాయి. దీని ద్వారా లభించే అల్ట్రా బ్యాటరీ సేవర్ ద్వారా ఐదు శాతం బ్యాటరీతో ఫోన్ ఐదు గంటల పాటు పనిచేయనుంది. ఈ ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంను మొదటగా అందుకునే ఏడు ఫోన్లూ ఇవే.

1. షియోమీ ఎంఐ 10
ఎంఐ 10 5జీ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో రానుంది. ఇందులో ఎక్స్55 మోడెంను అందించడం విశేషం. ఇందులో 108 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో మ్యాజిక్ క్లోన్ అనే కొత్త తరహా ఫీచర్ కూడా ఉండటం విశేషం.

2. రెడ్ మీ నోట్ 9
షియోమీ తాజాగా లాంచ్ చేసిన బడ్జెట్ ఫోన్ ఇదే. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11,999గా ఉంది.

3. రెడ్ మీ నోట్ 9 ప్రో
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్ తో వచ్చిన ఈ వేరియంట్ల ధర రూ.16,999 వరకు ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది.

4. రెడ్ మీ నోట్ 8
ఇందులో వెనకైపు 48 మెగా పిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉన్న నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.

5. రెడ్ మీ నోట్ 8 ప్రో
రెడ్ మీ నోట్ 8 ప్రోలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

6. రెడ్ మీ నోట్ 7
దీని ధర రూ.11,490గా ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు.

7. రెడ్ మీ నోట్ 7 ప్రో
ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ పై పనిచేయనుంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ స్క్రీన్ ను అందించారు. ఇందులో వెనకవైపు 48 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.





Untitled Document
Advertisements