జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది కక్ష్య సాధింపు కోసమే – నారా లోకేశ్

     Written by : smtv Desk | Wed, Aug 19, 2020, 12:41 PM

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. జగన్ గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్‌పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు. ఆయన జైలులో కరోనా బారిన పడటం బాధాకరం అని అన్నారు.


జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం అని తక్షణమే ఆసుపత్రికి తరలించి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి అని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

Untitled Document
Advertisements