గేదెలు, ఆవులుకు ఆధార్ కార్డు!

     Written by : smtv Desk | Sat, Sep 12, 2020, 11:09 AM

గేదెలు, ఆవులుకు ఆధార్ కార్డు!

ఆధార్ కార్డు గురించి అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా ఆధార్ కార్డు పొందొచ్చు. ఆధార్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఐడెంటికీ కార్డుగా కూడా పనిచేస్తుంది. ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ లభిస్తాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకని ఆలోచిస్తున్నారా? కేవలం మనుషులకు మాత్రమే కాకుండా ఇప్పుడు పశువులకు కూడా ఆధార్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. మోదీ సర్కార్ ఆవులు, గేదెలు వంటి వాటికి కూడా ఆధార్ కార్డులు జారీ చేస్తోంది. అసలు వీటికి ఎందుకు ఆధార్ కార్డులు అని ఆలోచిస్తున్నారా?

అక్కడికే వస్తున్నాను. ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే పశువులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఆదాయానికి ఆధార్ కార్డుకు లింక్ ఏముందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఆవులు, గేదెలకు ఆధార్ నెంబర్ ఇస్తే.. ఈ నెంబర్‌ సాయంతో ఆ ఆవు, గేదే ఏ జాతికి చెందింది, దారి బ్రీడ్ ఏంటి, దాని ఆరోగ్యం ఎలా ఉంది, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, గేదె యజమని ఎవరు, ఏమైనా వ్యాక్సిన్లు వాడుతున్నారా.. ఇలా చాలా విషయాలపై స్పష్టత వస్తుంది.

దీంతో గేదెలు, ఆవుల పూర్తి సమచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మోదీ సర్కార్ ఇటీవలనే ఇగోపాల యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో కూడా పశు ఆధార్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ గేదెలు లేదా ఆవుల వివరాలు తెలుసుకోవచ్చు.

కాగా ఇగోపాల యాప్ ద్వారా పశువులను కొనుగోలు చేయొచ్చు. లేదంటే విక్రయించొచ్చు. ఇలాంటి సమయంలో ఆవు లేదా గేదె పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. దీని కోసం ఆవు, గేదె ఆధార్ నెంబర్ ఉంటే వాటిని సంబంధించిన పూర్తి వివరాలు కొనుగోలుదారులకు కూడా లభిస్తాయి. ఇంకా యాప్ ద్వారా పశువులకు వ్యాక్సిన్ సదుపాయం పొందొచ్చు.





Untitled Document
Advertisements