ఎల్‌ఐసీ నుంచి ప్రత్యేక స్కీమ్...ఎస్‌బీఐ నుంచి స్పెషల్ పథకం!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 06:46 PM

ఎల్‌ఐసీ నుంచి ప్రత్యేక స్కీమ్...ఎస్‌బీఐ నుంచి స్పెషల్ పథకం!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. అంతేకాకుండా మరో ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా కస్టమర్లకు పలు రకాల పాలసీలు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు సంస్థలు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక స్కీమ్స్ అందిస్తున్నాయి. వీటిల్లో ఎందులో డబ్బులు పెడితే లాభమో తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (PMVVY) స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు ప్రతి ఆర్థిక సంవత్సరం మారుతూ వస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే పదేళ్లపాటు చేరిన వారికి డబ్బులు లభిస్తాయి. దీని కోసం స్కీమ్‌లో చేరేటప్పుడు ఒకేసారి డబ్బులు కట్టాలి.

ఎల్‌ఐసీ వయ వందన యోజన పథకంలో చేరితే ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతి నెలా వడ్డీ డబ్బులు పొందొచ్చు. అదే మీరు ఏడాదికి ఒకసారి వడ్డీ మొత్తాన్ని తీసుకుంటే 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు రూ.9,250 పెన్షన్ లభిస్తుంది. ఇంట్లో 60 ఏళ్లు వయసు కలిగిన భార్యాభర్తలు ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టి చేరితే ప్రతి నెలా రూ.18,500 పొందొచ్చు. కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్కీమ్‌లో చేరిన వారికి మెడికల్ ఎమర్జెన్సీ కోసం పదేళ్ల ముందే పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.

ఇక ఎస్‌బీఐ విషయానికి వస్తే.. ఈ బ్యాంక్ కూడా సీనియర్ సిజిన్స్ కోసం ఎస్‌బీఐ ఉయ్‌కేర్ ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకంలో చేరితో 30 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ పొందొచ్చు. ఈ స్కీ్మ్ టెన్యూర్ 5 ఏళ్లు. అంటే ఐదేళ్లు డబ్బులు వెనక్కి తీసుకోవడం కుదరదు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ 6.2 శాతం వడ్డీని అందిస్తోంది. అంటే ఎల్‌ఐసీ స్కీమ్ కన్నా ఇందులో తక్కువ వడ్డీ వస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెల చివరి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఐదేళ్ల కన్నా ముందుగానే డబ్బులు తీసుకుంటే అప్పుడు 5.8 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఎల్‌ఐసీ స్కీమ్ ఉత్తమమని చెప్పుకోవచ్చు.





Untitled Document
Advertisements