ఒడిశా: కరోనా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 11:44 AM

ఒడిశా: కరోనా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

అసలే కరోనా మహమ్మారి బారినపడి ఆ రోగులంతా ఎప్పుడు బయట పడతామా అని బిక్కుబిక్కుమంటున్నారు. అగ్ని ప్రమాదం వారిని మరింత వణికించింది. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఓ కరోనా హాస్పిటల్‌లో ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోగులందరినీ హుటాహుటిన మరో హాస్పిటల్‌కు తరలించారు. 127 మంది రోగులు ప్రాణాలతో బయటపడ్డారు.

కటక్ జిల్లా జగత్‌పూర్‌లోని సద్గురు కొవిడ్ హాస్పిటల్‌లో సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. వణికిన రోగులు

హాస్పిటల్ ప్రాంగణమంతా అంబులెన్స్‌లతో నిండిపోయింది. రోగులందరినీ ఇరత హాస్పిటళ్లకు షిఫ్ట్ చేశారు. అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు.. సద్గురు హాస్పిటల్‌కు ఫైర్ సేఫ్టీ చర్యలకు సంబంధించిన అనుమతులు లేవని అధికారులు తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ఈ హాస్పిటల్‌ నెల కిందటే కార్యకలాపాలు ప్రారంభించింది. 150 పడకలతో సేవలు అందిస్తోంది. కటక్, భువనేశ్వర్‌లో హాస్పిటళ్లు కిక్కిరిసిపోవడంతో రోగులు ఈ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒడిశాలో సుమారు 1.84 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించారు.





Untitled Document
Advertisements