వింగ్ స్మార్ట్ ఫోన్ ధరను నిర్ణయించిన ఎల్జీ

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 04:11 PM

వింగ్ స్మార్ట్ ఫోన్ ధరను నిర్ణయించిన ఎల్జీ

ఎల్జీ వింగ్ ఫోన్ ధరను ఎట్టకేలకు నిర్ణయించారు. ఈ ఫోన్ ధరను 10,98,900 కొరియా వాన్‌లుగా(సుమారు రూ.69,100) నిర్ణయించారు. ఈ డ్యూయల్ డిస్ ప్లే ఫోన్ గతవారం లాంచ్ అయింది. కొరియాలో దీనికి సంబంధించిన అమ్మకాలు అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం తెలియరాలేదు. ఎల్జీ వింగ్ స్మార్ట్ ఫోన్ అరోరా గ్రే, ఇల్యూషన్ స్కై రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇతర మార్కెట్లలో కూడా ఇదే ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కొరియా హెరాల్డ్ కథనం మేరకు.. ఈ ఫోన్ వచ్చే నెలలో దక్షిణకొరియాలో సేల్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఉత్తర అమెరికాలో, యూరోప్‌ల్లో దీన్ని విక్రయించనున్నారు. ఎల్జీ ఎక్స్‌ప్రోరర్ ప్రాజెక్టులో భాగంగా విడుదలైన మొదటి ఫోన్ ఇదే. ఎల్జీ వింగ్ ధర విషయంలో కూడా కంపెనీ దూకుడుగా వ్యవహరించింది. ఫోల్డబుల్ ఫోన్ల కంటే దీని ధర చాలా తక్కువగా ఉండటం విశేషం.

ఈ ఫోన్ రెండు డిస్ ప్లేలతో లాంచ్ అయింది. ప్రధాన డిస్ ప్లేను 90 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. అప్పుడు రెండో డిస్ ప్లే సాయంతో ఫోన్ T-ఆకారంలోకి మారుతుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లను కూడా కంపెనీ స్వీకరించట్లేదు. ఈ ఫోన్ అక్టోబర్‌లో కొన్నవారికి తర్వాత రెండు సంవత్సరాల్లో స్క్రీన్ మార్చుకోవాలనుకున్నప్పుడు 70 శాతం డిస్కౌంట్ లభించేలా కూపన్ అందించనున్నారు.

ఎల్జీ వింగ్ డ్యూయల్ డిస్ ప్లే ఫోన్. ఇందులో ప్రధాన డిస్ ప్లేను తిప్పినప్పుడు, రెండో డిస్ ప్లే కనిపిస్తుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీ-ఓఎల్ఈడీ ఫుల్ విజన్ ప్యానెల్‌ను ప్రధాన డిస్ ప్లేగా అందించారు. 3.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ జీ-ఓఎల్ఈడీ ప్యానెల్‌ను రెండో డిస్‌ప్లేగా అందించారు. దీని ప్రధాన డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20.5:9గానూ, రెండో డిస్ ప్లే సైజ్ 1.15:1గానూ ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత క్యూఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో గింబల్ మోషన్ కెమెరా టెక్నాలజీని అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.





Untitled Document
Advertisements