లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త!

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 04:16 PM

లోన్ తీసుకున్నవారికి బ్యాంక్ శుభవార్త!

దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దారిలోనే ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా నడుస్తోంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.

బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి రిస్ట్రక్చరింగ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో లోన్ తీసుకున్న వారు మరి కొన్ని నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు. ఇది వరకు లోన్ మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న వారికి కూడా ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఇలా రిస్ట్రక్చరింగ్ చేసుకునే రుణ గ్రహీతలపై ఫీజు విధించే అవకాశముంది.

లోన్ రిస్ట్రక్చరింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలని భావించే వారి క్రెడిట్ కార్డు, లోన్ ఔట్ ‌స్టాండింగ్ మొత్తం కనీసం రూ.25,000 ఉండాలి. హోమ్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్ వంటి వాటికి లోన్ రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్ పొందొచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఊరట కలిగించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 1 నాటికి ముందు 30 రోజులు డిఫాల్ట్ కాని వారికి మాత్రమే ఈ లోన్ మారటోరియం ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ రిస్ట్రక్చర్ బెనిఫిట్ పొందొచ్చు. గరిష్టంగా 24 నెలల వరకు లోన్ రిస్ట్రక్చరింగ్ ప్రయోనం పొందొచ్చు. అంటే మీరు రెండేళ్ల పాటు ఈఎంఐ కట్టక్కర్లేదు. అయితే దీని కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఐటీఆర్ వంటి డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది.

మరోవైపు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి లోన్ తీసుకున్న వారికి కూడా రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్ అందుబాటులో ఉంది. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరల కలిగే నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు లోన్ రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్‌ను రిటైల్ కస్టమర్లకు అందిస్తోంది.





Untitled Document
Advertisements