కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 09:36 AM

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకా ప్రయోగాలు కొన్ని తుది దశ పరీక్షల్లో ఉండగా, రష్యా ఇప్పటికే ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, జాన్సన్ అండ్ జాన్సన్ ఈ రేసులో చేరింది. ఒకే ఒక్క డోసుతో కరోనాను అంతమొందించేంత సామర్థ్యం కలిగిన టీకాను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

ప్రస్తుతం ఈ టీకా తుది దశ ప్రయోగాల్లో ఉండగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు ఈ టీకా ఇవ్వనున్నారు. మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు జాన్సన్ అండన్ జాన్సన్ అధికారి ఒకరు తెలిపారు.





Untitled Document
Advertisements