మత్తెక్కించే అందం ఈ లోకాన్ని వీడి 24ఏళ్లు

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 11:06 AM

మత్తెక్కించే అందం ఈ లోకాన్ని వీడి 24ఏళ్లు

వెండితెరపై వెలిగిపోయాలని కలలు కనేవారు చాలామంది ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. ఇలాగే ఎన్నో కలలతో సినిమాల్లో రాణించాలని చెన్నై ట్రైన్ ఎక్కిన విజయలక్ష్మి అనే యువతి ఐటెం బాంబ్‌గా యువతను ఉర్రూతలూగించింది. హీరోయిన్లకు మించిన క్రేజ్‌తో తన అందచందాలతో ప్రేక్షకుల మనసులు దోచుకుని ‘ఇండియన్‌ మార్లిన్‌ మన్రో’గా జేజేలు కొట్టించుకున్న ఆమె ఇంకెవరో కాదు

సిల్క్‌స్మిత. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అన్నంత క్రేజీ స్టార్‌గా వెండితెరను దశాబ్దంన్నర పాటు ఏలిన ఈ తార అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఐటెం బాంబ్ ఈ లోకాన్ని వీడి 24ఏళ్లు అయినా ప్రేక్షకుల మనసులో మాత్రం ఎప్పటికీ నిలిపిపోయింది.

వడ్లపట్ల విజయలక్ష్మి అలియాస్ స్కిల్‌స్మిత డిసెంబర్ 2, 1960 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు మండలం కొవ్వలి గ్రామంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు మానేసిన ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా ఆమె చెన్నై చేరుకుని సినిమాల్లో నటించారు. 17 ఏళ్లలో ఐదు భాషల్లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం సినీ నిర్మాణంలో పెట్టి తీవ్రంగా నష్టపోయారు. 1996, సెప్టెంబర్ 23వ తేదీన చెన్నైలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

తన చూపులతోనే ఎదుటి వ్యక్తికి వలేసి తన వశం చేసుకునే టాలెంట్ ఉన్న స్కిల్‌స్మిత నిజజీవితంలో చాలా సాధారణంగా ఉండేదట. తన మనసుకు నచ్చిన అతికొద్ది మందితో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండేవారని తెలిసిన వారు చెబుతుంటారు. అందుకే ఆమె ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇప్పటికే తెలియలేదు. ప్రేమలో విఫలమైనందు వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పడిందని మరికొందరు చెబుతుంటారు. ఆమె ఈ లోకాన్ని విడిచి 24ఏళ్లు అవుతున్నా ఆ అందం అభిమానుల మనసుల్లో నుంచి కదులుతూనే ఉంటుంది.





Untitled Document
Advertisements