ఒకే రోజులో రూ.50 వేల కోట్లు...అత్యంత ధనవంతుడిగా రికార్డ్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 01:02 PM

ఒకే రోజులో రూ.50 వేల కోట్లు...అత్యంత ధనవంతుడిగా రికార్డ్

గ్రామాల్లో ప్రజలు రోజుకు రూ.300 సంపాదించాలంటేనే చాలా కష్టపడుతున్నారు. పట్టణాల్లో రోజు చాలా మంది రోజుకు రూ.1,000 వరకు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తండ్రీకొడుకుల సంపద ఒక్క రోజులోనే ఏకంగా రూ.50 వేల కోట్లకు పైగా పెరిగింది. నమ్మలేకపోతున్నారు కదా? రూ.50 వేల కోట్లు ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది నిజమేనండి.

వివరాలోకి వెలితే.. ఎర్నెస్ట్ గార్సియా 2, ఈయన కొడుకు ఎర్నెస్ట్ గ్రాసియా 3 సంపద ఒక్క రోజులోనే రూ.51,471 కోట్లు పెరిగింది. వీరి సంవద విలువ ఏకంగా రూ.1,58,825 కోట్లకు చేరింది. అంటే 21 బిలియన్ డాలర్ల పైకి ఎగసింది. దీనికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఎర్నెస్ట్ గార్సియా 2 ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్న కర్వానా కంపెనీ ప్రమోటర్. దీనికి ఈయన కొడుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్.

కర్వాన్ కంపెనీ షేరు ధర మంగళవారం ఏకంగా 32 శాతం పరుగులు పెట్టింది. దీంతో ఎర్నెస్ట్ గార్సియా 2, ఈయన కుమారుడు సంపద విలువ కూడా భారీగా పెరిగిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. వీరిద్దరి సంపద విలువ రూ.1.58 లక్షల కోట్లకు చేరింది. ఈయన 1991లో దివాలాకు వచ్చిన ఒక కంపెనీని కొనుగోలు చేశాడు. దీని పేరు అగ్లీ డక్లింగ్. ఇది కార్ రెంటింగ్ సంస్థ. అయితే ఎర్నెస్ట్ గార్సియా 2 ఈ సంస్థను ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థగా మార్చేశారు.

క్రెడిట్ స్కోర్ బాగులేని వారికి కారు కొనేందుకు రుణం అందించేంది. ఇంకా కార్లను కూడా విక్రయించేది. 1996లో ఈయన తన కంపెనీని నాస్‌డాక్‌లో లిస్ట్ చేశారు. 2017లో ఇది ఐపీవోకు వచ్చేసింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు చాలా మంది అమెరికన్లు సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారు. దీంతో కంపెనీ షేరు ఈ ఏడాది 150 శాతానికి పైగా పెరిగింది.





Untitled Document
Advertisements