శుభమన్ గిల్ ఫీల్డింగ్ కి సారా టెండుల్కర్ ఫిదా

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 03:00 PM

శుభమన్ గిల్ ఫీల్డింగ్ కి  సారా టెండుల్కర్ ఫిదా

గత సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన శుభమన్ గిల్ ఈసారి కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పంజాబ్‌కు చెందిన ఈ యువ బ్యాట్స్‌మెన్.. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న గిల్.. ముంబైపై 11 బంతుల్లో 7 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా విఫలం కావడంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమిపాలైంది.

కానీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి క్యాప్షన్ ఏమీ రాయనప్పటికీ.. లవ్ ఎమోజీలను ఉంచింది. దీంతో ఆమె ముంబై ఇండియన్స్‌ను సపోర్ట్ చేసిందో లేదంటే కోల్‌కతా మద్దతు పలికిందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

ఇంతకు ముందు కూడా సారా, గిల్.. సోషల్ మీడియాలో ఒకే క్యాప్షన్‌తో ఫొటోలు పెట్టడం ఆసక్తి కలిగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్టు చేసిన సారా.. ‘I Spy’ అనే క్యాప్షన్ పెట్టగా.. కాసేపటికే శుభమన్ గిల్ కూడా ట్విట్టర్లో అదే క్యాప్షన్ తన ఫొటో ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఫ్యాన్స్.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. సారా తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో ఆ రూమర్లకు ఆజ్యం పోసినట్టయ్యింది. కోల్‌కతా, ముంబై మ్యాచ్‌కు ముందు సారా ఎవరికి సపోర్ట్ చేస్తుందని కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్లో ప్రశ్నించగా...? మరికొందరు గిల్ త్వరగా ఔటయ్యాక.. సారాతో చాటింగ్ కోసమే త్వరగా ఔటయ్యాడేమోనంటూ సెటైర్లు వేశారు.





Untitled Document
Advertisements