ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో మరణం

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 04:49 PM

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో మరణం

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) హార్ట్ ఎటాక్ కారణంగా కన్నుమూశారు. స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ టీమ్‌లో సభ్యుడైన జోన్స్ ముంబైలో మరణించారు. ఆయన వారం రోజులుగా ముంబైలోని ఓ సెవన్ స్టార్ హోటల్‌లోని బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నారు. స్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ ఆఫ్-ట్యూబ్ కామెంట్రీకి డీన్ జోన్స్ సంతకం చేశారు. ప్రపంచంలోని అనేక లీగ్‌ల్లో ఆయన కామెంటేటర్‌గా వ్యవహరించారు.

జోన్స్ కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలోనే ఉంది. గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన జోన్స్.. 11 గంటలకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ విషయమై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత హోటల్ కారిడార్‌లో సహచరులతో ముచ్చటిస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలారు. అక్కడున్న వారు వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో హరికిషన్ దాస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్‌కు వచ్చే సరికే ఆయన చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

మెల్‌బోర్న్‌లో జన్మించిన డీన్ జోన్స్.. ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడి 46.55 సగటుతో 3631 రన్స్ చేశాడు. 11 సెంచరీలు చేసిన జోన్స్ హయ్యస్ట్ స్కోరు 216. అలెన్ బోర్డర్ టీంలో జోన్స్ కీలక సభ్యుడు.

164 వన్డేలు ఆడిన జోన్స్.. 6068 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డీన్ జోన్స్ ఆకస్మిక మరణం పట్ల స్టార్ స్పోర్ట్స్ ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేసింది. ఆయన భౌతిక కాయం విషయమై అవసరమైన అరేంజ్‌మెంట్స్ చేయడం కోసం ఆస్ట్రేలియన్ హై కమిషన్‌తో టచ్‌లో ఉన్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.


Former Australian cricketer Dean Jones passed away Thursday after suffering a cardiac arrest. He was 59.

Jones was part...

Posted by Smtv Web onnbsp;Thursday, September 24, 2020














Untitled Document
Advertisements