అక్టోబర్ 8న రానున్న గెలాక్సీ ఎఫ్41

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 04:51 PM

అక్టోబర్ 8న రానున్న గెలాక్సీ ఎఫ్41

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 మనదేశంలో అక్టోబర్ 8వ తేదీన లాంచ్ కానుంది. శాంసంగ్ కొత్తగా ప్రకటించిన ఎఫ్-సిరీస్‌లో మొదటగా లాంచ్ అయిన ఫోన్ ఇదే. గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇందులో సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఇందులో తెలిపారు. గతవారం గెలాక్సీ ఎఫ్41 గీక్ బెంచ్‌లో కనిపించింది. దీంతో ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా లీకయ్యాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 మనదేశంలో అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు రిలీజ్ కానుందని ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీ ద్వారా తెలిపింది. ఫ్లిప్ కార్ట్ పేజీ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను కూడా తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ జరుగుతుందా? లేదా అనే విషయాన్ని ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ పైభాగంలో, పక్కభాగంలో అంచులు సన్నగా ఉన్నాయి. టీలిష్ రంగులో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

గతవారం SM-F415F అనే మోడల్ నంబర్‌తో ఒక ఫోన్ గీక్ బెంచ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.


ఇందులో టైప్-సీ పోర్టు ఉండనుందని, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఫోన్ కింద భాగంలో స్పీకర్ ఉండనుందని ఓ టిప్ స్టర్ తెలిపారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుందని ఈ లీక్ స్టర్ తెలిపారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41.. గెలాక్సీ ఎం31కు రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్‌గా రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఎఫ్-సిరీస్ ఫోన్ల ధర మరో రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. శాంసంగ్ దీని ధర గురించి ఎటువంటి వివరాలనూ వెల్లడించలేదు. అక్టోబర్ 8వ తేదీన అధికారికంగా ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements