ఎల్జీ కే-సిరీస్ ఫోన్లు కే62, కే52 లాంచ్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 05:51 PM

ఎల్జీ కే-సిరీస్ ఫోన్లు  కే62, కే52 లాంచ్

ఎల్జీ కే62, ఎల్జీ కే52 ఫోన్లు కే-సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు ఫుల్ విజన్ డిస్ ప్లేను అందించారు. దీంతోపాటు ఇందులో ఎల్జీ 3డీ సౌండ్ ఇంజిన్ కూడా ఉంది. ఎల్జీ వీటిలో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. దీంతో పాటు 48 మెగా పిక్సెల్ ప్రధాన సెన్సార్‌గా కూడా ఇందులో ఉన్నాయి.

వీటికి సంబంధించిన ధరలను ఎల్జీ ఇంకా ప్రకటించలేదు. ఆసియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్‌ల్లో ఈ ఫోన్ సేల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఎల్జీ కే62 వైట్, స్కై బ్లూ రంగుల్లో లాంచ్ అయింది. ఎల్జీ కే52 వైట్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. వీటికి సంబంధించిన ధరను కంపెనీ తర్వాత వెల్లడించనుంది.

ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ విజన్ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్‌గా ఉంది. 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 28 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత క్యూ ఓఎస్‌పై పనిచేయనుంది.

ఎల్జీ ఇందులో 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 186 గ్రాములుగానూ ఉంది.

ఇందులో కూడా 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ విజన్ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. ఇందులో కూడా ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్‌గా ఉండనుంది. 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత క్యూ ఓఎస్‌పైనే పనిచేయనుంది.

ఎల్జీ ఇందులో 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 186 గ్రాములుగానూ ఉంది.





Untitled Document
Advertisements