'భారత్-చైనా ఏ సాయం కోరినా చేస్తా'

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 11:19 AM

'భారత్-చైనా ఏ సాయం కోరినా చేస్తా'

భారత్- చైనా సరిహద్దుల్లో మధ్య నెలకున్న వివాదం పరిష్కారం కోసం తన వంతు సహాకారం అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చైనా-భారత్ ఉద్రిక్తతలపై మధ్యవర్తిత్వం అంశం గురించి ట్రంప్ ప్రస్తావించారు. ‘భారత్, చైనాల మధ్య వివాదం చాలా చాలా సంక్లిష్టంగా మారింది.. దీనిని నుంచి బయటపడటానికి ఇరు దేశాలూ ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నా.. ఒకవేళ తమ సహకారం కోరితే.. మనఃస్ఫూర్తిగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని వైట్‌హౌస్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో గురువారం వ్యాఖ్యానించారు.

గతంలోనూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను భారత్, చైనాలు సున్నితంగా తిరస్కరించాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకుంటామని, మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని స్పష్టం చేశాయి. ఇటీవల సైనికాధికారుల మధ్య జరిగిన ఆరో విడత చర్చల్లో సరిహద్దులకు అదనపు బలగాల తరలింపును నిలిపివేయాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో మరోసారి మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం.

ఇక, చైనాతో నెలకున్న ఉద్రిక్తతల విషయమై ట్రంప్ యంత్రాంగం భారత్‌కు పూర్తిగా సహకరిస్తుందని దక్షిణాసియా కార్నేగ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ డైరెక్టర్ యాష్లే టెల్లీస్ అన్నారు. వాస్తవానికి, చైనాను భారత్ దీటుగా ఎదుర్కొవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది.. ఇది చైనాతో అమెరికా ద్వైపాక్షిక సమస్యలలో భాగం. కానీ ఇక్కడ ఇంకా ఏదో జరుగుతోందని భావిస్తున్నాను. ఇంకా ఏంటంటే, అమెరికా కంటే మరో ప్రత్యామ్నాయం ఉందని అనుకోవడం లేదు’ టెల్లీస్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో చైనా వైఖరి చాలా నిర్లక్ష్యంగా ఉందని, దీనిని అమెరికా విస్మరించలేదని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements