గడ్డం వల్ల ఎన్ని లాభాలో తెలుసా

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 03:19 PM

గడ్డం వల్ల ఎన్ని లాభాలో తెలుసా

1. యూవీ రేస్ ని బ్లాక్ చేస్తాయి. బాగా ఒత్తుగా పెంచిన గడ్డం 95% యూవీ రేస్ ని బ్లాక్ చేస్తుందని సైంటిఫిక్ రిసెర్చ్ ప్రూవ్ చేస్తోంది. ఇందువల్ల స్కిన్ బర్న్ నుండి మాత్రమే కాదు కాన్సర్ కూడా ప్రివెంట్ చేయబడుతుంది.

2. షేవింగ్ వల్ల యాక్నే ప్రాబ్లం పెరుగుతుంది. మీరు గడ్డం పెంచారంటే, గడ్డం కింద ఉన్న స్కిన్ చాలా స్మూత్ గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. షేవింగ్ యాక్నే ని కారణమయ్యే బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేస్తుంది. అంటే, గడ్డం పెంచడం వలన మీ స్కిన్ హెల్దీగా ఉంటుందన్న మాట.

3. గడ్డం ఉన్న వాళ్ళు మెచ్యూర్డ్ గా కనిపిస్తారు. రిలయబుల్ గా ఉంటారు. ఎట్రాక్టివ్ గా హెల్దీ గా కూడా ఉంటారని రిసెర్చ్ చెప్తోంది.

4. గడ్డం కాంఫిడెన్స్ పెంచుతుంది. క్లీన్ షేవ్ కంటే ఈ విషయం లో గడ్డానికే ఓటు. గడ్డం వల్ల పెరిగే కాంఫిడెన్స్ అతనికే కాదు, అతని చుట్టు పక్కల వాళ్ళకి కూడా తెలుస్తుందని అంటారు.

5. గడ్డం నాచురల్ ఫిల్టర్ గా పని చేస్తుంది. ఎలర్జీ కలిగించే వాటిని ముక్కులోకి వెళ్ళకుండా గడ్డం అడ్డం కొడుతుంది. అయితే ఈ నాచురల్ ఫిల్టర్ ని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ, ట్రిమ్ చేస్తూ ఉండాలనుకోండి.

6. యంగ్ గా కనిపించడమే కాదు, యంగ్ గా ఫీల్ అవుతారు కూడా. గడ్డం వల్ల యాక్నే ఉండదు, బ్లెమిషెస్ ఉండవు, స్కిన్ డిస్ కలర్ అవ్వదు, స్మూత్ గా ఉంటుంది... ఇందు వల్ల స్కిన్ హెల్దీ గా ఉంటుంది.

7. స్కిన్ మీద ముడతలు రావు. సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గినప్పుడు ముడతలు రావడం కూడా తగ్గుతుంది. అయితే, అందరూ ఈ పని చేయలేరు కానీ, చేయగలిగిన వారికి ఇది మంచి ఆప్షన్.

8. గమ్ డిసీజ్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది. గడ్డం ఎలర్జీ కారకాలని లోపలికి పోనివ్వకుండా ఆపడమే కాదు, గమ్ డిసీజ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. అయినా, రోజూ రెండు పూటలా బ్రష్ చేసుకుంటూ మీ వంతు పని మీరు చేయాలనుకోండి.

9. స్కిన్ ని మాయిస్ట్ గా ఉంచుతుంది. షేవింగ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి. ముఖం మీద ఎక్కడైనా కొద్దిగా చెక్కుకుపోవచ్చు. ఇవన్నీ డ్రై స్కిన్ కి కారణాలవుతాయి. గడ్డం పెంచడం వల్ల ఈ ప్రాబ్లంస్ ఏవీ ఉండవు. స్కిన్ నైస్ గా, హెల్దీ గా ఉంటుంది.

10. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. గడ్డం పెంచడం వల్ల పోర్స్ ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అందు వల్ల రకరకాల ఇన్‌ఫెక్షన్స్ నుండి రక్షింపబడతారు.

గడ్డం పెంచడం కూల్ మాత్రమే కాదు, హెల్దీ కూడా.





Untitled Document
Advertisements