నోకియా 7.3.. డిజైన్ అదుర్స్!

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 04:10 PM

నోకియా 7.3.. డిజైన్ అదుర్స్!

నోకియా 7.3 ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో ఈ ఫోన్‌ను అన్ని కోణాల్లో చూపించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. ముందువైపు హోల్ పంచ్ డిస్ ప్లే ఉంది. అంటే మొత్తంగా ఐదు కెమెరాలన్న మాట. ఈ ఫోన్ ఐఎఫ్ఏ 2020 ఈవెంట్లో లాంచ్ అవుతుందని గతంలో అంచనా వేశారు. అయితే ప్రస్తుతం 2020 నాలుగో త్రైమాసికంలో(అక్టోబర్-డిసెంబర్) లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫొటోలను స్టీవ్ అనే టిప్ స్టర్ షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఫ్లాట్ డిస్ ప్లే, ఎడమవైపు పైభాగంలో హోల్ పంచ్ కట్ అవుట్ ను చూడవచ్చు. నోకియా బ్రాండ్ లోగో ఫోన్ కింద భాగంలో ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్టు, మైక్, స్పీకర్ ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియోజాక్ ఫోన్ పైభాగంలో ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. కెమెరాల సెటప్ పక్కన రెండు ఎల్ఈడీ ఫ్లాష్‌లు ఉన్నాయి. కెమెరాకు కింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

నోకియా 7.3.. 5జీతో వచ్చే అవకాశం ఉంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉండే అవకాశం ఉంది. ముందువైపు 24 మెగా పిక్సెల్ ఉండనుందని సమాచారం. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు గ్లాస్ బాడీ కాకుండా ప్లాస్టిక్ బాడీని అందించనున్నారని లీకుల ద్వారా తెలుస్తోంది.

తాజాగా వచ్చిన లీకు ప్రకారం దీని మందం 0.82 సెంటీమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. నోకియా 7.3 స్మార్ట్ ఫోన్ ఐఎఫ్ఏ 2020 కార్యక్రమంలోనే లాంచ్ కావాల్సింది. అయితే ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికానికి వాయిదా పడింది.





Untitled Document
Advertisements