ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తో కళా ప్రపంచం పేదదై పోయింది :నరేంద్ర మోడీ

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 04:14 PM

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీ లోకానికి మాత్రమే కాక, యావత్ భారతావని కి తీరని లోటు. ఎస్పీ బాలు మరణం పై ఇప్పటికే సినీ పరిశ్రమ కి చెందిన నటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పై విచారం వ్యక్తం చేశారు.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తో కళా ప్రపంచం పేదదై పోయింది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎస్పీ బాలు స్వరం మరియు సంగీతం భారత దేశం అంతటా పలు దశాబ్దాలు గా మంత్ర ముగ్ధులను చేసింది అని, ఈ బాధాకరమైన సమయం లో నా ఆలోచనలు కుటుంబం మరియు ఆయన ఆరాధకుల పై ఉన్నట్లు తెలిపారు. ఓం శాంతి అంటూ నరేంద్ర మోడీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు.

గత నెల రెండవ తేదీన ఎంజీఎం ఆసుపత్రి లో చేరిన ఎస్పీ బాలు కరోనా వైరస్ ను పోరాడి నిలిచినా, అనారోగ్యం కారణంగా నేడు ప్రాణాలను కోల్పోయారు. 40 వేలకు పైగా పలు బాషల్లో పాటలను పాడిన బాలు, ఎన్నో అవార్డులను సొంత చేసుకున్నారు. నేడు యావత్ సంగీత లోకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తో దుఃఖ సాగరం లో మునిగి ఉంది.





Untitled Document
Advertisements