డాడీస్ ఆర్మీతో ఢిల్లీ కుర్రాళ్ల పోరు

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 05:11 PM

డాడీస్ ఆర్మీతో ఢిల్లీ కుర్రాళ్ల పోరు

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (సెప్టెంబర్ 25) ఐపీఎల్ ఏడో మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో యువకులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్.. అనువజ్ఞులతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన సీఎస్‌కే.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో పోరాడి ఓడింది. ఢిల్లీ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌పై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

ఇప్పటి వరకూ ఇరు జట్లు ఐపీఎల్‌లో రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. చెన్నై 15సార్లు, ఢిల్లీ ఆరుసార్లు విజయం సాధించాయి. లాస్ట్ సీజన్లో చెన్నై మూడుసార్లు ఢిల్లీని ఓడించింది. క్వాలిఫైయర్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై.. ఓ మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో.. మరో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2014లో యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై చెన్నై 93 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకూ ఢిల్లీ మాత్రమే ఐపీఎల్ ఫైనల్ చేరలేదు. ఇప్పటి వరకూ ఆ జట్టు నాలుగుసార్లు ప్లేఆఫ్‌ చేరింది.

ఢిల్లీపై చెన్నై బ్యాట్స‌మెన్‌లలో షేన్ వాట్సన్ 481 పరుగులు, అంబటి రాయుడు 477 రన్స్ చేశారు. రవీంద్ర జడేజా ఢిల్లీపై 300 పరుగులు చేయడంతోపాటు... 15 వికెట్లు తీశాడు. కాగా ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్.. చెన్నైపై 122.56 స్ట్రయిక్ రేట్‌తో 641 రన్స్ చేయగా.. అమిత్ మిశ్రా ధోనీ సేనపై 13 వికెట్లు పడగొట్టాడు.

గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు సింగిల్స్ తీసి... చివర్లో మూడు సిక్సులు బాదిన ధోనీ ఆటతీరుపై విమర్శలొచ్చాయి. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ తొలి మ్యాచ్‌లో రనౌటై నిరాశపర్చాడు. చెన్నై రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో వీరెలా రాణిస్తారో చూసేందుకు అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌లోనూ రాయుడు ఆడకపోవచ్చు.





Untitled Document
Advertisements