దేశం ఓ గొప్ప స్వరాన్ని కోల్పోయింది: రాష్ట్రపతి

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 05:18 PM

దేశం ఓ గొప్ప స్వరాన్ని కోల్పోయింది: రాష్ట్రపతి

గాన గంధర్వుడు ఎస్పీ బాలు మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతం ఓ అద్భుతమైన స్వరాన్ని కోల్పోయిందన్నారు. సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. అభిమానులు ఆయణ్ని ‘పాటలు పాడే చంద్రుడి’గా పిలుచుకుంటారని పేర్కొన్నారు.

పద్మ భూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులను బాలసుబ్రహ్మణ్యం సొంతం చేసుకున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేశారు. బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

బాలు అస్తమయంతో సాంస్కృతిక ప్రపంచం చాలా పేదదైపోయింది. దేశంలోని ప్రతి ఇంటికీ పరిచయమైన పేరు ఆయనది. ఆయన శ్రావ్యమైన స్వరం, సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ

సంగీత ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటని ప్రధాని పేర్కొన్నారు. బాలు స్వరం దశాబ్దాలుగా దేశంలో ఇంటింటా అలరించిందని గుర్తు చేశారు. సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవలను గుర్తుచేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements