శాంసంగ్ గెలాక్సీ ఏ72లో మొదటిసారి ఆ ఫీచర్!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 11:38 AM

శాంసంగ్ గెలాక్సీ ఏ72లో మొదటిసారి ఆ ఫీచర్!

శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు ఐదు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 2021 ప్రధమార్థంలో వచ్చే అవకాశం ఉంది. మొదటగా ఈ ఫీచర్‌ను ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌లో అందిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మిడ్ రేంజ్ విభాగంలో ఉన్న గెలాక్సీ ఏ72లో దీన్ని మొదటిసారి అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన గెలాక్సీ ఏ71కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

దక్షిణకొరియాకు చెందిన ది ఎలెక్ రిపోర్ట్స్ కంపెనీ ఈ వివరాలను వెల్లడించింది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్‌గా ఉండనుండగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ఫోన్ ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు కూడా ఈ కంపెనీ తన కథనంలో పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52 కూడా గెలాక్సీ ఏ72తో పాటు లాంచ్ అవుతుందని ఈ కథనంలో పేర్కొన్నారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించనున్నారు. గెలాక్సీ ఏ51కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

అయితే శాంసంగ్ లాంచ్ చేయబోయే ఈ గెలాక్సీ ఏ72 ఐదు కెమెరాలతో వచ్చే మొదటి ఫోన్ కాదు. నోకియా 9 ప్యూర్‌వ్యూలో ఇప్పటికే వెనకవైపు ఐదు కెమెరాలు ఉన్నాయి. శాంసంగ్ వచ్చే ఏటి నుంచి ఇటువంటి స్మార్ట్ ఫోన్లు మరిన్ని లాంచ్ చేయనుందని కూడా సమాచారం.

ఇంతకుముందు వచ్చిన కథనాల ప్రకారం గెలాక్సీ ఏ-సిరీస్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వచ్చే కొద్ది ఫోన్లలో గెలాక్సీ ఏ72 కూడా ఒకటని తెలుస్తోంది. శాంసంగ్ ఈ ఫీచర్‌ను వచ్చే సంవత్సరం మరిన్ని హైఎండ్ ఏ-సిరీస్ ఫోన్లకు తేనున్నట్లు సమాచారం. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టంలో ప్రత్యేకమైన హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్ ఫీచర్లను అందిస్తారు. దీని ద్వారా బ్లర్ అవ్వకుండా ఫొటోలు తీయవచ్చు.





Untitled Document
Advertisements